16న జిల్లాలోని ఆరు కేంద్రాల్లో వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-13T06:07:39+05:30 IST

దేశ వ్యాప్తంగా ఈ నెల 16న కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలోని ఆరు కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్య లు చేపట్టింది.

16న జిల్లాలోని ఆరు కేంద్రాల్లో వ్యాక్సిన్‌

రోజుకు 40 మంది చొప్పున టీకా

కలెక్టర్‌ హన్మంతరావు వెల్లడి


సంగారెడ్డి అర్బన్‌, జనవరి 12 :  దేశ వ్యాప్తంగా ఈ నెల 16న కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలోని ఆరు కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్య లు చేపట్టింది. నాలుగు ప్రభుత్వ, రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. జిల్లాలోని దిగ్వాల్‌ పీహెచ్‌సీ, సంగారెడ్డిలోని ఇంద్రనగర్‌ యూపీహెచ్‌సీ, పటాన్‌చెరులోని ఏరియా ఆస్పత్రి(ఆర్‌హెచ్‌సీ), జహీరాబాద్‌ ఆస్పత్రిలోని పీపీ యూనిట్‌, కంది సమీపంలోని బాలాజీ మెడికవర్‌ ఆస్పత్రి, ఫసల్‌వాది సమీపంలోని ఎంఎన్‌ఆర్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌ హన్మంతరావు పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో 40 మంది చొప్పున ఒక డోసు టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 21 వరకు మొదటి దశలో గుర్తించిన వారికి వ్యాక్సిన్‌ వేయడం పూర్తి చేస్తారన్నారు. కాగా జిల్లాకు 1200 డోసుల వ్యాక్సిన్‌ అవసరం పడుతాయని వైద్యాధికారులు సర్కారుకు నివేదించారు. ఈ నెల 14, 15 తేదీల్లో జిల్లా కేంద్రానికి వ్యాక్సిన్‌ సరఫరా అయ్యే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.


దిగ్వాల్‌లో 25 మందికి డమ్మీ వ్యాక్సినేషన్‌

కోహీర్‌, జనవరి 12: మండలంలోని దిగ్వాల్‌ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  డాక్టర్‌ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం కరోనా వ్యాక్సిన్‌ డ్రై-రన్‌ నిర్వహించారు. ఈ వ్యాక్సినేషన్‌ డ్రై-రన్‌లో భాగంగా 25 మందికి డమ్మీ వ్యాక్సినేషన్‌ వేశారు. 

Updated Date - 2021-01-13T06:07:39+05:30 IST