అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-31T05:26:45+05:30 IST

అంగన్‌వాడీ ద్వారా గర్భిణులు, పిల్లలకు అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు.

అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు అందజేస్తున్న సునీతారెడ్డి, మదన్‌రెడ్డి

రాష్ట్ర మహిళా కమిషనర్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

శివ్వంపేట/నర్సాపూర్‌, డిసెంబరు 30 : అంగన్‌వాడీ ద్వారా గర్భిణులు, పిల్లలకు అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం శివ్వంపేట మండలం గూడురులోని షాదీఖానాలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లను అందజేశారు. అలాగే గ్రామీణ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుశిక్షణా కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. కుట్టు శిక్షణ ద్వారా మంచి ఉపాధి అవకాశాలున్నాయని, దీన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జడ్పీ కో ఆప్షన్‌ మన్సూర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రమణాగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, సీడీపీవో హేమభార్గవి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. నర్సాపూర్‌ మండలంలో కొత్తగా ఏర్పాటుచేసిన సూపర్‌ మార్కెట్‌ను సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి గురువారం ప్రారంభించి మాట్లాడారు. సూపర్‌ మార్కెట్‌ వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ అనసూయఅశోక్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ శివకుమార్‌, పార్టీ మండలాధ్యక్షుడు శేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:26:45+05:30 IST