గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-12-31T17:07:32+05:30 IST

పెద్దశంకరంపేట పట్టణ శివారులో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహం గురువారం లభ్యమైనట్లు సీఐ జార్జి తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

పెద్దశంకరంపేట, డిసెంబరు 30 : పెద్దశంకరంపేట పట్టణ శివారులో గుర్తు తెలియని ఓ  మహిళ మృతదేహం గురువారం లభ్యమైనట్లు సీఐ జార్జి తెలిపారు. పెద్దశంకరంపేటలోని రేణుకామాత ఆలయం వెనక గల మురుగు కాలువలో మహిళ (35) మృతదేహం ఉన్నదని సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ జార్జి, ఎస్‌ఐ మోహన్‌రెడ్డి క్లూస్‌ టీంతో వివరాలను సేకరించారు. మహిళ వారంరోజుల క్రితం మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీఐ వెంట సిబ్బంది సాయిలు, వీరప్ప, రాజు ఉన్నారు. 

Updated Date - 2021-12-31T17:07:32+05:30 IST