ఆటోలు ఢీకొని ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2021-12-31T17:04:38+05:30 IST
ఎదురెదురుగా వస్తున్న ఆటోలు ఢీ కొనడంతో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. గురువారం నిజాంపేట నుంచి నారాయణఖేడ్‌కు ఓ ఆటో వెళ్తోంది.

నారాయణఖేడ్, డిసెంబరు 30 : ఎదురెదురుగా వస్తున్న ఆటోలు ఢీ కొనడంతో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. గురువారం నిజాంపేట నుంచి నారాయణఖేడ్‌కు ఓ ఆటో వెళ్తోంది. అదే సమయంలో ఖేడ్ నుంచి నిజాంపేట వైపు మరో ఆటో వస్తోంది. మండల పరిధిలోని దర్గాతండా సమీపంలోకి రాగానే 161బీ జాతీయ రహదారిపై రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో ఖేడ్ ఆస్పత్రికి తరలించారు.