ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి టీఆర్‌ఎస్‌ గెలిచింది

ABN , First Publish Date - 2021-05-06T04:30:49+05:30 IST

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి టీఆర్‌ఎస్‌ గెలిచిందని కాంగ్రెస్‌ పార్టీ పట్టణాధ్యక్షుడు అత్తు ఇమామ్‌ విమర్శించారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి టీఆర్‌ఎస్‌ గెలిచింది
సమావేశంలో మాట్లాడుతున్న అత్తు ఇమామ్‌

 కాంగ్రెస్‌ పార్టీ సిద్దిపేట పట్టణాధ్యక్షుడు అత్తు ఇమామ్‌


సిద్దిపేట టౌన్‌, మే 5: సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి టీఆర్‌ఎస్‌ గెలిచిందని కాంగ్రెస్‌ పార్టీ పట్టణాధ్యక్షుడు అత్తు ఇమామ్‌ విమర్శించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. కొన్ని వార్డుల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు డబ్బులు, మద్యం యథేచ్ఛగా పంచి ప్రలోభ పెట్టారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ సీట్లు కైవసం చేసుకున్నదని విమర్శించారు. స్థానిక నాయకులతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులను మున్సిపల్‌ ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ఏర్పాటు చేశారన్నారు. డబ్బులు పంచుతున్నారని అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోకుండా అధికార పార్టీకి తొత్తులుగా మారారని పేర్కొన్నారు. తమ పార్టీ ఓటమికి గలా కారణాలను పార్టీ నాయకులు, కార్యకర్తలతో విశ్లేషించుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తామన్నారు. 


 

Updated Date - 2021-05-06T04:30:49+05:30 IST