ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీఆర్‌ఎస్
ABN , First Publish Date - 2021-01-12T05:30:00+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎ్‌సపాలపై ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారని, దీంతో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.

మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
జహీరాబాద్, జనవరి 12: రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎ్‌సపాలపై ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారని, దీంతో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల ఫలితాలు మొదలుకుని హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల వరకు చూస్తుంటే ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కేంద్రప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వాడుకుంటే నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడేదన్నారు. ఈ పథకం కింద కేంద్రప్రభుత్వం ప్రతియేటా రూ. 200కోట్లను రాష్ర్టానికి కేటాయిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపేరిట లక్షకోట్ల మేర నిధులను కేసీఆర్, ఆయన అనుచరులు కలిసి దుర్వినియోగం చేశారని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో సైతం బీజేపీ విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామన్న భయంతో ఎన్నికలు జరుపడంలేదని ఎద్దేవా చేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎ్‌సకు వీఆర్‌ఎ్‌సను ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లానాయకులు జగన్నాథ్, జహీరాబాద్ అసెంబ్లీకన్వీనర్ శ్రీనివా్‌సగౌడ్, మాజీఎమ్మెల్సీ లక్ష్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. కాగా మొగుడంపల్లి మండలంలోని గుడిపల్లిలో అంబేడ్కర్ విగ్రహాన్ని మాజీఎంపీ వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హైదరాబాద్ ట్యాంకుబండ్‌పై 125అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తానని ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, లేదంటే త్వరలో తామే ఏర్పాటు చేసుకుంటామన్నారు.