ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులను త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-12-08T04:36:47+05:30 IST

ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ అధికారులకు సూచించారు.

ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులను త్వరగా పూర్తిచేయాలి
మంగోల్‌ వద్ద పైప్‌లైన్‌ పనులను పరిశీలిస్తున్న స్మితాసబర్వాల్‌

గజ్వేల్‌/కొండపాక, నవంబరు 7: ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపాక మండలం మంగోల్‌లో నిర్మిస్తున్న 500 ఎంఎల్‌డీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులను, తిప్పారం వద్ద మల్లన్నసాగర్‌ ఇన్‌టెక్‌వెల్‌ పనులను, గజ్వేల్‌ మండలం అక్కారం వద్ద ఇంటర్మీడియట్‌ పనులను ఆమె సీఎంవో అదనపు కార్యదర్శి ప్రియాంకవర్గీ్‌సతో కలిసి పరిశీలించారు. అనంతరం కోమటిబండ వద్ద అధికారులతో మిషన్‌ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించి, పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట కలెక్టర్‌ ఎం.హన్మంతరావు, మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, సీఈ చక్రవర్తి, ఎస్‌ఈ శ్రీనివాసాచారి, ఈఈ రాజయ్య, డీఈఈ నాగార్జున ఉన్నారు. 

 

Updated Date - 2021-12-08T04:36:47+05:30 IST