ఇద్దరు ఎస్‌ఐల బదిలీ

ABN , First Publish Date - 2021-10-30T04:20:34+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రమణకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇద్దరు ఎస్‌ఐల బదిలీ

సంగారెడ్డి టౌన్‌, అక్టోబరు 29: సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రమణకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పటాన్‌చెరు మండలం బీడీఎల్‌ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న నాగేశ్వర్‌రావును సంగారెడ్డి వీఆర్‌కు, మునిపల్లి ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డిని బీడీఎల్‌కు బదిలీ చేశారు. మునిపల్లికి ఇంకా ఎవరినీ నియమించలేదు. రెండు సంవత్సరాల పాటు వీరిద్దరూ ఆయా పోలీ్‌సస్టేషన్‌లలో పని చేస్తున్నందున వారిని బదిలీ చేసినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-10-30T04:20:34+05:30 IST