రోడ్డును ఆక్రమిస్తూ డబ్బాల ఏర్పాటుతో ట్రాఫిక్‌ సమస్య

ABN , First Publish Date - 2021-10-26T04:28:07+05:30 IST

జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతుండగా, ప్రధాన రోడ్డు సైతం ఆక్రమణకు గురవుతున్నది.

రోడ్డును ఆక్రమిస్తూ డబ్బాల ఏర్పాటుతో ట్రాఫిక్‌ సమస్య

మెదక్‌ మున్సిపాలిటీ, అక్టోబరు 25: జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతుండగా,  ప్రధాన రోడ్డు సైతం ఆక్రమణకు గురవుతున్నది. పట్టణంలోని రాందా్‌సచౌరస్తా వద్ద ఇరుకుగా ఉన్న జేఎన్‌రోడ్డు రహదారిలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు డబ్బాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య మరింత తీవ్రతరమవుతున్నది.  స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ  చర్యలు తీసుకోలేదు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వెంటనే స్పందించి  డబ్బాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-26T04:28:07+05:30 IST