ట్రాక్టర్‌ బోల్తాపడి కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2021-10-07T05:30:00+05:30 IST

గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ బోల్తాపడి పారిశుధ్య కార్మికుడు మృతి చెందాడు.

ట్రాక్టర్‌ బోల్తాపడి కార్మికుడి మృతి

జగదేవ్‌పూర్‌, అక్టోబరు 7: గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ బోల్తాపడి పారిశుధ్య కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన మర్కుక్‌ మండల పరిధిలోని భావానందపూర్‌ గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానందపూర్‌ గ్రామానికి చెందిన చిట్టమైన వెంకటేష్‌(42) పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం డంపుయార్డు వద్ద ట్రాక్టర్‌ ఎక్కి చెత్తను ఖాళీ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి లోయలో పడింది. దీంతో వెంకటేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సర్పంచ్‌ నాగరాజు, ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్‌, ఎంపీడీవో ఓబులేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఎక్స్‌ కవేటర్‌ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు మర్కుక్‌ ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.  

Updated Date - 2021-10-07T05:30:00+05:30 IST