మట్టిని తరలిస్తున్న టిప్పర్లు సీజ్‌

ABN , First Publish Date - 2021-05-21T04:53:42+05:30 IST

కృత్రిమ ఇసుక తయారీకి మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అధికారులు సీజ్‌ చేశారు. మండల పరిధిలోని ఆరుట్ల శివారులో గురువారం రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

మట్టిని తరలిస్తున్న టిప్పర్లు సీజ్‌

కంది, మే 20: కృత్రిమ ఇసుక తయారీకి మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అధికారులు సీజ్‌ చేశారు. మండల పరిధిలోని ఆరుట్ల శివారులో గురువారం రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మట్టిని తవ్వి తరలిస్తున్న మూడు టిప్పర్లను పట్టుకుని, తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించి సీజ్‌ చేశారు. కృత్రిమ ఇసుకను తయారు చేసినా, వాహనాల్లో తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ బి.సతీ్‌షకుమార్‌ హెచ్చరించారు. తనిఖీల్లో ఆర్‌ఐ సాయి శ్రీకాంత్‌, వీఆర్వో రామచంద్రయ్య సిబ్బంది పాల్గొన్నారు.


 

Updated Date - 2021-05-21T04:53:42+05:30 IST