ఫారెస్ట్‌ చెక్‌పోస్టు వద్ద కలప లారీ పట్టివేత

ABN , First Publish Date - 2021-10-26T04:25:26+05:30 IST

అక్రమంగా కలప రవాణా చేస్తున్న ఓ లారీని అటవీ అధికారులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

ఫారెస్ట్‌ చెక్‌పోస్టు వద్ద కలప లారీ పట్టివేత

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), అక్టోబరు 25: అక్రమంగా కలప రవాణా చేస్తున్న ఓ లారీని అటవీ అధికారులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతం నుంచి హైదరాబాద్‌ వైపునకు లారీలో అక్రమంగా కలప రవాణా చేస్తున్నారు. సదరు లారీని మనోహరాబాద్‌ మండలం దండుపల్లి పారెస్టు చెక్‌పోస్టు వద్ద అటవీ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన లారీలో కలపను లెక్కించి కేసు నమోదు చేయనున్నట్లు డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ రాజు వివరించారు. 

Updated Date - 2021-10-26T04:25:26+05:30 IST