ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత చర్చ జరపాలి

ABN , First Publish Date - 2022-01-01T04:23:23+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విద్యార్థి నాయకులు ప్రజల్లో విస్తృత చర్చ జరపాలని ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత చర్చ జరపాలి

 నారాయణరావుపేట, డిసెంబరు 31: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విద్యార్థి నాయకులు ప్రజల్లో విస్తృత చర్చ జరపాలని ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ సూచించారు. శుక్రవారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో టీఆర్‌ఎ్‌సవీ గ్రామశాఖ కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎ్‌సవీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఆరే అశోక్‌, ఉపాధ్యక్షులుగా పుర్రె శేఖర్‌, గూడూరు ప్రవీణ్‌, ప్రధాన కార్యదర్శిగా గడ్డం శేఖర్‌, కార్యదర్శులుగా బండారి శంకర్‌, అంతగిరి రమేష్‌, కోశాధికారిగా వాసూరి రాజు, ప్రచార కార్యదర్శిగా బండారి శ్రీకాంత్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌గా కోడూరి రోహిత్‌, కార్యవర్గ సభ్యులుగా అజయ్‌, తడకపల్లి అజయ్‌, గడ్డం వంశీ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకుల హరీశ్‌, టీఆర్‌ఎ్‌సవీ జిల్లా అధ్యక్షుడు మేర్గు మహేష్‌, ఇన్‌చార్జి రాచకొండ భిక్షపతి, గ్రామ కమిటీ అధ్యక్షుడు పొట్టేళ్ల చంద్రంగౌడ్‌, పార్టీ యూత్‌ అధ్యక్షుడు కోడూరి రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు శాతరాజుపల్లి సాయి, జిల్లాల శంకర్‌, రఘోత్తమ్‌రెడ్డి, ధర్మస్వామి, కాసం అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-01T04:23:23+05:30 IST