అభివృద్ధి పనుల్లో అలసత్వాన్ని సహించేది లేదు

ABN , First Publish Date - 2021-02-05T05:41:28+05:30 IST

అభివృద్ధి పనుల్లో అలసత్వాన్ని సహించేది లేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు.

అభివృద్ధి పనుల్లో అలసత్వాన్ని సహించేది లేదు
మినీ స్టేడియం పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు/జిన్నారం, ఫిబ్రవరి 4 : అభివృద్ధి పనుల్లో అలసత్వాన్ని సహించేది లేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. పటాన్‌చెరు పట్టణంలో జరుగుతున్న మినీ స్టేడియం, సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని, గుత్తేదారులు నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ విజయ్‌కుమార్‌, నాయకుడు అఫ్జల్‌, జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. అలాగే జిన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, సర్పంచ్‌ లావణ్య, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజేష్‌, తహసీల్దార్‌ దశరథ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-05T05:41:28+05:30 IST