వాకింగ్‌కు వెళ్లిన యువతి అదృశ్యం

ABN , First Publish Date - 2021-12-30T19:59:26+05:30 IST

వాకింగ్‌ చేసేందుకు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్నది.

వాకింగ్‌కు వెళ్లిన యువతి అదృశ్యం

పటాన్‌చెరు, డిసెంబరు 29 : వాకింగ్‌ చేసేందుకు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్నది. ఎస్‌ఐ సాయిలు వివరాల ప్రకారం స్థానిక ఏపీఆర్‌ విల్లా కాలనీలో నివసిస్తున్న కొమ్మనేని ప్రవళిక (24) మాదాపూర్‌లోని వ్యాల్యూల్యాబ్‌ అనే సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. మూడునెలలుగా ఏపీఆర్‌ కాలనీలోని మేనమామ ఇంటి వద్ద ఉంటున్నది. కాగా రాత్రి 9 గంటలకు వాకింగ్‌ వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం ప్రవళిక తండ్రి కృష్ణారావు, మేనమామ లక్ష్మణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాలనీ సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు అన్ని కోణాల్లో విచారిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-12-30T19:59:26+05:30 IST