అబ్బెందలో యువతి అదృశ్యం
ABN , First Publish Date - 2021-07-25T04:25:42+05:30 IST
మండలంలోని అబ్బెంద గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైంది.

నారాయణఖేడ్, జూలై 24: మండలంలోని అబ్బెంద గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైంది. శనివారం ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అబ్బెంద గ్రామానికి చెందిన బీమన్న కూతురు సంగీత(18) ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నది. ఈ నెల 23న తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి రాత్రి తిరిగి వచ్చేసరికి సంగీత ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. తండ్రి బీమన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ తెలిపారు.