స్నానానికి వెళ్లిన యువకుడి గల్లంతు

ABN , First Publish Date - 2021-03-14T06:25:36+05:30 IST

అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో నిండు ప్రాణం బలిగొన్న కొల్చారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

స్నానానికి వెళ్లిన యువకుడి గల్లంతు
గల్లంతైన నరేష్‌ కోసం గాలిస్తున్న గజ ఈతగాళ్లు


కుంటలోని మట్టి తరలింపు వల్లేనని  రైతుల ఆగ్రహం


కొల్చారం, మార్చి 13 : అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో నిండు ప్రాణం బలిగొన్న కొల్చారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మాసానికుంటలో నుండి ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టడంతో ప్రమాదాలకు నెలవుగా మారుతుందని రైతులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పెడచెవిన పెట్టడంతో యువకుడు నీటమునిగి మృతిచెందాడు. కొల్చారం మండల కేంద్రంలోని మాసానికుంటలో స్నానం చేసేందుకు శనివారం హైదరాబాద్‌ పరిసరా ప్రాంతాల నుంచి వచ్చిన నలుగురు యువకులు దిగారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నరేష్‌(25) భారీ గుంతలో పడి గల్లంతయ్యాడు. యువకుడి మృతదేహం కోసం చెరువులో గాలింపు చేపట్టినా సాయంత్రం వరకు మృతదేహం లభ్యం కాలేదు. ఇదిలా ఉండగా... గతంలో రెవెన్యూ, పోలీసు అధికారుల అండదండలతో టిప్పర్లతో మాసానికుంటలోని మట్టిని ఇష్టానుసారంగా తరలించారు. ఈ విషయమై పైఅధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎమ్మెల్యే, కలెక్టర్‌ అనుమతితోనే తరలిస్తున్నామంటూ అడ్డుకున్న రైతులను బెదిరించారని పలువురు వాపోతున్నారు.


Updated Date - 2021-03-14T06:25:36+05:30 IST