బైక్‌ను లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-13T05:30:00+05:30 IST

బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.

బైక్‌ను లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

సంగారెడ్డి క్రైం, జనవరి 13: బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని పోతిరెడ్డిపల్లిలో బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  సంగారెడ్డి పట్టణానికి చెందిన అలీ(35)  రాత్రి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో బైక్‌పై రోడ్డు డివైడర్‌ను దాటుతుండగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొన్నది. దీంతో అలీ మృతదేహం లారీ కింద పడి నుజ్జునుజ్జయింది. బైక్‌పై ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలానికి సంగారెడ్డి రూరల్‌ పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుభాష్‌ తెలిపారు.

Updated Date - 2021-01-13T05:30:00+05:30 IST