చికిత్స పొందుతూ యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-03-25T05:29:47+05:30 IST

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

తూప్రాన్‌, మార్చి 24 : పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఎస్‌ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం తిమ్మాపూర్‌కు చెందిన తూం ఆనంద్‌ (24) కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మద్యానికి బానిసైన ఆనంద్‌ భార్య పావనితో నిత్య గొడవపడేవాడు. ఈ క్రమంలో 17న ఉదయం 10.30 గంటలకు ఇంట్లోంచి వెళ్లిపోయి తూప్రాన్‌కు చేరుకున్నాడు. తూప్రాన్‌ పెద్దచెరువు కట్టపై సాయంత్రం మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి మేడ్చల్‌లోని లీలా ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో 23న సూరారంలోని నారాయణ మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి సోదరుడు తూం సతీష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. 

Updated Date - 2021-03-25T05:29:47+05:30 IST