భర్త మందలించాడని ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ అదృశ్యం
ABN , First Publish Date - 2021-05-06T05:06:41+05:30 IST
భర్త మందలించాడని ఇంట్లో చెప్పకుండా వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది.

కంది, మే 5 : భర్త మందలించాడని ఇంట్లో చెప్పకుండా వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన నీరుడి పద్మమ్మ (50) కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నది. దీంతో ఉదయం సమయానికి నిద్రలేవలేకపోయేది. ఈ విషయమై ఆమె భర్త జంగయ్య ఈ నెల 1న పద్మమ్మను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన పద్మమ్మ అదే రోజు ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు చుట్టు పక్కల, స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసినా జాడ దొరకలేదు. పద్మమ్మ కుమారుడు కుమార్ బధవారం సంగారెడ్డి రూరల్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పద్మమ్మ ఇంటి నుంచి వెళ్లినపుడు ఆమె ఒంటిపై ఎరుపు రంగు చీర ధరించిందని, 5.2 అడుగుల ఎత్తు ఉంటుందని ఎస్‌ఐ అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సభాష్ తెలిపారు.