పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం

ABN , First Publish Date - 2021-03-23T05:15:15+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించడంతో పాటు పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పొడగించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం
జహీరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఉద్యోగులు

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం


సంగారెడ్డి రూరల్‌, మార్చి 22: ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించడంతో పాటు పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పొడగించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట టీఎన్జీవోస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం వద్ద, కొత్త బస్టాండ్‌ ఆవరణలో పీఆర్టీయూ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. 



మెదక్‌లో


మెదక్‌ అర్బన్‌: టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా గెజిటెడ్‌ ప్రధానోపాఽధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సదర్శన్‌మూర్తి, మధుమోహన్‌ హర్షం వ్యకం చేశారు. జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శి చక్రవర్తి, మహేందర్‌గౌడ్‌ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 30 శాతం ఫిట్‌మెంట్‌ను స్వాగతిస్తున్నట్లు టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రమేష్‌, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ప్రణీద్‌కుమార్‌, రాజ్‌గోపాల్‌గౌడ్‌, తపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లం తెలిపారు. 


Updated Date - 2021-03-23T05:15:15+05:30 IST