గుర్తుతెలియని వ్యక్తి సజీవదహనం

ABN , First Publish Date - 2021-08-28T05:22:20+05:30 IST

గుర్తుతెలియని వ్యక్తిని సజీవదహనం అయిన సంఘటన కొల్చారం మండల శివారులో శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

గుర్తుతెలియని వ్యక్తి సజీవదహనం

కొల్చారం, ఆగస్టు 27 : గుర్తుతెలియని వ్యక్తిని సజీవదహనం అయిన సంఘటన కొల్చారం మండల శివారులో శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తిని వాహనంలో తీసుకొచ్చి శివారు అటవీ ప్రాంతంలో పెట్రోలు పోసి నిప్పంటించారు. మృతుడి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని మెదక్‌ రూరల్‌ సీఐ పాలవెల్లి చేరుకుని ఆధారాలను స్వీకరించారు. మెరున్‌ కలర్‌ షర్టు, బెల్టును స్వాధీనం చేసుకున్నారు. మృతుని మెడకు తాడు లాంటిది బిగించి హత్యచేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే అదనపు ఎస్పీ కృష్ణమూర్తి కూడా సంఘటనా స్థలాన్ని సాయంత్రం సందర్శించారు. 

Updated Date - 2021-08-28T05:22:20+05:30 IST