చేనేతలను పట్టించుకోని టీఆర్‌ఎస్‌ సర్కారు

ABN , First Publish Date - 2022-01-01T04:22:16+05:30 IST

దుబ్బాకలోని చేనేత కార్మికులు మూడునెలలుగా పని లేకుండా ఆర్థాకలితో అలమటిస్తే పట్టించుకోని టీఆర్‌ఎస్‌ నాయకులు చేనేతల మీద సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని బీజేపీ నాయకుడు, రాష్ట్ర చేనేత హక్కుల పోరాట సమితి నాయకుడు మచ్చ శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.

చేనేతలను పట్టించుకోని టీఆర్‌ఎస్‌ సర్కారు

 దుబ్బాక, డిసెంబరు 31: దుబ్బాకలోని చేనేత కార్మికులు మూడునెలలుగా పని లేకుండా ఆర్థాకలితో అలమటిస్తే పట్టించుకోని టీఆర్‌ఎస్‌ నాయకులు చేనేతల మీద సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని బీజేపీ నాయకుడు, రాష్ట్ర చేనేత హక్కుల పోరాట సమితి నాయకుడు మచ్చ శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం దుబ్బాక చేనేత సహకార సంఘంలో చేనేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. దుబ్బాక చేనేతలకు సీఎం కేసీఆర్‌ అందిస్తామన్న రూ.25లక్షలను వెంటనే ఇవ్వాలని కోరారు. చేనేతల ముడిసరుకు సబ్సిడీ కూడా రావడంలేదన్నారు. చేనేతల బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సమంత కేవలం ర్యాంప్‌ డ్యాన్స్‌లకు పరిమితమై, నేతలన్నలకు ఒరగబెట్టిందేమీలేదన్నారు. దుబ్బాకలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కేవలం రాజకీయం కోసమే టీఆర్‌ఎస్‌ నాయకులు కేంద్రంపై బురుదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఓబీసీ నాయకులు పుట్టవంశీ, పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాజురెడ్డి, బాల్‌రాజ్‌, విఠోభా పాల్గొన్నారు.


 

Updated Date - 2022-01-01T04:22:16+05:30 IST