ముక్కోటి వృక్షార్చనే సంపద
ABN , First Publish Date - 2021-07-25T04:39:19+05:30 IST
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ముక్కోటి వృక్షార్చన తెలంగాణలో రాబోయే సమాజానికి అందిస్తున్న సంపద అని జనగామా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
వృక్షార్చనలో భాగంగా మొక్కలను నాటిన పలువురు నేతలు
మద్దూరు, జూలై 34: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ముక్కోటి వృక్షార్చన తెలంగాణలో రాబోయే సమాజానికి అందిస్తున్న సంపద అని జనగామా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం మద్దూరులో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలతమల్లేశం, మండల ప్రత్యేకాధికారి అమీనాభాను, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ నరేందర్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మేక సంతోష్, మండల అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, రాజమల్లయ్య ఎంపీటీసీ కనకమ్మనాగయ్య, ఉపసర్పంచ్ ఆరీఫ్, ఈసీ పరశురాములు, ఆర్ఐ అయిలయ్య, ఎంపీవో సుధీర్‌కుమార్, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. దూళిమిట్ట మండలంలో తహసీల్దార్ అశోక్, సర్పంచ్ దుబ్బుడు దీపికవేణుగోపాల్రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, వరలక్ష్మీసాగర్ పాల్గొన్నారు.
చేర్యాల: పట్టణంలోని పెద్దచెరువుకట్టతో పాటు మార్కెట్‌యార్డు ఆవరణలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మొక్కలను నాటారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ స్వరూప రాణి, వైస్ చైర్మన్ రాజీవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు నరేందర్, కనకమ్మ, కో-ఆప్షన్‌సభ్యులు నాగేశ్వర్రావు, ఆరోగ్యరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రాజేశం, నాయకులు ముస్త్యాల బాలనర్సయ్య, కొండయ్య, కిష్టయ్య, శ్రీధర్‌రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ధర్మ కర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ధర్మకర్తలు పత్యేకపూజలు నిర్వహించారు. ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్ధప్ప, వైస్‌ఎంపీపీ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో కేవీఎల్ అనూరాధ మండలంలోని గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. చేర్యాల మండలంలోని నాగపురి గ్రామంలో ఎంపీపీ కరుణాకర్, సర్పంచు బండమీది సంతోషి, గుర్జకుంటలో జడ్పీటీసీ శెట్టె మల్లేశం, సర్పంచు పుర్మ మమత, ముస్త్యాల గ్రామంలో సర్పంచులఫోరం అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి మొక్కలు నాటారు.
విరివిగా మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే రసమయి
బెజ్జంకి, జూలై 24: సీఎం కేసీఆర్ కలలుగన్న ఆకుపచ్చని తెలంగాణలో అందరూ భాగస్వాములై విరివిగా మొక్కలను నాటి సంరక్షించాలని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కోటి వృక్షార్చనలో భాగంగా బెజ్జంకి, బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కవిత, సర్పంచులు మంజుల, తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సంజీవరెడ్డి, ఎంపీడీవో రాఘవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి: జడ్పీ సీఈవో
చిన్నకోడూరు, జూలై 24: నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని జడ్పీ సీఈవో సుమతి అన్నారు. రామంచలో ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, పీఏసీఏస్ చైర్మన్లు సదానందం, కనకరాజు, సర్పంచ్ సంతోషి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి నాయకులు విక్రమాదిత్య, యాదవరెడ్డి, శ్రీకాంత్, దత్తు, మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో సోమిరెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
