లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
ABN , First Publish Date - 2021-05-21T05:51:58+05:30 IST
సిద్దిపేట లయన్స్ క్లబ్ ఎంతో మందికి చేయూతనిస్తున్నదని, లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

సిద్దిపేట లయన్స్ క్లబ్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌ను అందజేసిన మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట సిటీ, మే 20: సిద్దిపేట లయన్స్ క్లబ్ ఎంతో మందికి చేయూతనిస్తున్నదని, లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి నివాసంలో లయన్స్ క్లబ్ సిద్దిపేట, దోమ రోహన్ ఫౌండేషన్ సౌజన్యంతో నూతన అంబులెన్స్‌ను మంత్రి సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి అందజేశారు. అంబులెన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను మెడికల్ కళాశాల డైరెక్టర్ తమిళ్‌అరసికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు పేదల ఆరోగ్యం, సేవ కార్యక్రమాల్లో ఆదర్శంగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ నాయకం లక్ష్మణ్, క్లబ్ అధ్యక్షుడు వినోద్ మోదని, ప్రతినిధులు సత్యనారాయణ, శ్రీనివాస్, కొండల్, రఘు, సిద్దు తదితరులు పాల్గొన్నారు.