పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-10-22T05:13:23+05:30 IST

పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్‌ఐ ఎండి.గౌస్‌ అన్నారు.

పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
చిన్నశంకరంపేటలో జూనియర్‌ కళాశాల విద్యార్థులకు విధి నిర్వహణపై వివరిస్తున్న పోలీసులు

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

చిన్నశంకరంపేట/పెద్దశంకరంపేట/పాపన్నపేట/హవేళీఘణపూర్‌/చిలప్‌చెడ్‌/అల్లాదుర్గం/రేగోడు/టేక్మాల్‌, అక్టోబరు 21 : పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్‌ఐ ఎండి.గౌస్‌ అన్నారు. గురువారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట పోలీ్‌సస్టేషన్‌లో అమరవీరులకు నివాళులర్పించి వారి త్యాగాలను గుర్తుచేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ నుంచి బస్డాండ్‌ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబేషన్‌ ఎస్‌ఐ భానుచందర్‌గౌడ్‌, ఏఎ్‌సఐ మల్లికార్జున్‌, గంగయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ వీరన్న, వెంకటేశం, సిబ్బంది వినోద్‌, సురేష్‌, కిషన్‌, శ్రీలత, గౌస్‌, వేణు పాల్గొన్నారు. పెద్దశంకరంపేటలో పోలీసులు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్‌ఐ నరేందర్‌, ట్రైనీ ఎస్‌ఐ దీక్షిత్‌రెడ్డి మాట్లాడారు. పీఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు రామచంద్రాచారి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు కెవి. రవీందర్‌, పోమ్యానాయక్‌, ఏసయ్య, వెంకటేశం, పోలీసులు పాల్గొన్నారు. పాపన్నపేట మండలంలోని పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐ సురేష్‌ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం పాపన్నపేటలోని పురవీధుల గుండా విద్యార్థులతో కలిసి పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ట్రైనీ ఎస్‌ఐ రాజ్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సంగయ్య, శ్యామ్‌సుందర్‌, పోలీసులు పాల్గొన్నారు. హవేళీఘణపూర్‌లో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌరస్తాలో పోలీస్‌ అమరవీరులకు నివాళులర్పించారు. ట్రైనీ ఎస్‌ఐ పల్లవి, ఏఎ్‌సఐ లక్ష్మణ్‌, పోలీసులు పాల్గొన్నారు. చిల్‌పచెడ్‌ మండలంలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్‌ఐ మల్లారెడ్డి ట్రైనీ ఎస్‌ఐ త్రిమూర్తులు, సిబ్బంది ఉన్నారు. పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివని అల్లాదుర్గం ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, ట్రైనీ ఎస్‌ఐ కెజి.స్నేహ అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి అల్లాదుర్గంలో ర్యాలీ నిర్వహించారు. ఏఎ్‌సఐ విఠల్‌, గాలయ్య, పోలీసులు పాల్గొన్నారు. రేగోడ్‌ మండలంలో పోలీసులు ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి గాంధీ చౌక్‌ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ట్రైనీ ఎస్‌ఐ ప్రణయ్‌, తేజ్‌రెడ్డి, సర్పంచ్‌ నర్సింహులు పాల్గొన్నారు. టేక్మాల్‌ మండలంలో ఎస్‌ఐ నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పోలీసు సిబ్బంది రవీందర్‌, అమృతయ్య, సుధీర్‌, నాగేందర్‌ ఉన్నారు. 

సంగారెడ్డి జిల్లాలో

కల్హేర్‌/హత్నూర/నారాయణఖేడ్‌/కంగ్టి/నాగల్‌గిద్ద/రామచంద్రాపురం, అక్టోబరు 21 : మండల కేంద్రమైన కల్హేర్‌లో గురువారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్హేర్‌ ఏఎ్‌సఐ శంకర్‌, సురేష్‌, గంగారాం, ఏబెల్‌, రామకృష్ణారెడ్డి, నిర్మల పాల్గొన్నారు. హత్నూరలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్‌ఐ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏఎ్‌సఐలు వీరయ్య, జగదీశ్వర్‌, స్థానిక సర్పంచ్‌ వీరస్వామిగౌడ్‌, మాజీ జడ్పీటీసీ ఆశయ్య, నాయకులు రవికుమార్‌, పెంటేష్‌, లింగారెడ్డి, ఆసిఫ్‌, నర్సింహులు పాల్గొన్నారు. పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్‌లో పోలీసులు అమరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. మండల కేంద్రమైన కంగ్టి పోలీ్‌సస్టేషన్‌లో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. గతంలో కంగ్టి పీఎ్‌సలో పనిచేస్తూ మృతిచెందిన కానిస్టేబుల్‌ సురేష్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏఎ్‌సఐ నారాయణతో  పాటు పలువురు పోలీసులను యువజన కాంగ్రెస్‌ నాయకులు శివకుమార్‌పటేల్‌, చంద్రకాంత్‌పటేల్‌, లక్ష్మణ్‌, సంజీవ్‌కుమార్‌ సన్మానించారు. నాగల్‌గిద్ద మండలంలోని పోలీ్‌సస్టేషన్‌లో పోలీస్‌ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఎస్‌ఐ విజయ్‌రావు, ఏఎ్‌సఐ జాన్‌, సిబ్బంది నర్సింహులు, అబ్రహం, సంజీవ్‌ పాల్గొన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రామచంద్రాపురం పోలీ్‌సస్టేషన్‌లో సీఐ సంజయ్‌కుమార్‌ పోలీస్‌ విధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్‌ఐలు కోటేశ్వర్‌రావు, శశికాంత్‌రెడ్డి, వెంకటేష్‌, యూసు్‌ఫఅలీ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:13:23+05:30 IST