అక్క ఇంటికి వచ్చి శవమయ్యాడు
ABN , First Publish Date - 2021-10-30T04:58:45+05:30 IST
మద్యానికి బానిసై నిత్యం గొడవపడుతున్న తమ్ముడి తీరుతో విసుగెత్తిన అన్న, తండ్రితో కలిసి తమ్ముడిని హతమార్చాడు.

ఒమన్ నుంచి వచ్చి దారుణ హత్యకు గురైన ఉమర్
మెదక్ అర్బన్, అక్టోబరు 29: మద్యానికి బానిసై నిత్యం గొడవపడుతున్న తమ్ముడి తీరుతో విసుగెత్తిన అన్న, తండ్రితో కలిసి తమ్ముడిని హతమార్చాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని కుమ్మరిగడ్డలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుమ్మరిగడ్డకు చెందిన చిట్కూరి రవి(35), తల్లిదండ్రులు లక్ష్మయ్య, సత్తమ్మతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అన్న శ్రీనివాస్ పక్క ఇంట్లో ఉంటున్నాడు. కాగా రవికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉండేవారు. కుటుంబ కలహాలతో ఏడాది క్రితం అతడి భార్య అనూష చిన్న కూతురు ప్రణితతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్దకూతురు అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నది. భార్య మృతి అనంతరం రవి తాగుడుకు బానిసయ్యాడు. ప్రతీరోజు తాగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో గొడవపడేవాడు. గురువారం రాత్రి విపరీతంగా మద్యం తాగి ఇంటికి వచ్చిన రవి తండ్రి లక్ష్మయ్యతో గొడవకు దిగాడు. అన్న శ్రీనివాస్ సర్దిచెప్పేందుకు యత్నించగా వినకపోగా గొడవ మరింత ముదిరింది. ఆగ్రహంతో అన్న శ్రీనివాస్ రోకలిబండతో రవి తలపై మోదాడు. తండ్రి లక్ష్మయ్య సైతం కర్రతో కొట్టడంతో తలకు తీవ్రగాయాలతో రవి అక్కడికక్కడే మృతిచెందాడు. చుట్టుపక్కలవారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పట్టణ సీఐ వెంకట్ తెలిపారు. నిందితులు శ్రీనివాస్, లక్ష్మయ్య పరారీలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.