చెరువులో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-31T04:49:26+05:30 IST

చెరువులో స్నానానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతి చెందిన సంఘటన చింతమడక గ్రామంలో గురువారం జరిగింది.

చెరువులో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి

సిద్దిపేట రూరల్‌, డిసెంబరు 30: చెరువులో స్నానానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతి చెందిన సంఘటన చింతమడక గ్రామంలో గురువారం జరిగింది. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతమడకకు చెందిన చెప్యాల తిరుపతి(36).. గురువారం బంధువుల దశదిన కర్మ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పెద్ద చెరువులో స్నానానికి వెళ్లాడు. నీటిలో మునిగిన తిరుపతి బయటకు రాలేదు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టగా రాత్రి మృతదేహం లభ్యమైంది. తిరుపతికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


 

Updated Date - 2021-12-31T04:49:26+05:30 IST