ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-12-10T04:53:35+05:30 IST
ప్రమాదవశాత్తు చెరువులో జారిపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం కంది మండలం కవలంపేటలో జరిగింది.

కంది, డిసెంబరు 9: ప్రమాదవశాత్తు చెరువులో జారిపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం కంది మండలం కవలంపేటలో జరిగింది. సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటకలోని యాకుత్‌పూర్ గ్రామానికి చెందిన రంగుల హనుమంతు(41) ఏడాది క్రితం భార్యతో కలిసి కవలంపేటకు వచ్చి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి మద్యం తాగేందుకు కవలంపేట ఊదం చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మునిగిపోయాడు. గురువారం ఉదయం అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ వివరించారు.