ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-09T04:29:23+05:30 IST

గొర్రెలను మేపడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కుసునూర్‌ గ్రామంలో చోటు చేసుకున్నది.

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

రాయికోడ్‌, డిసెంబరు 8: గొర్రెలను మేపడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కుసునూర్‌ గ్రామంలో చోటు చేసుకున్నది. కుటుంబీకులు, ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. కుసునూర్‌ గ్రామానికి చెందిన మంగళవారం  మైపాల్‌(30)  గొర్రెలను మేపుతూ, వాటికి గ్రామ శివారులోని చెరువులో  నీళ్లు తాగించే క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. మైపాల్‌  చెరువులో పడిన విషయాన్ని గమనించిన కొందరు  స్థానికులకు సమాచారం అందించారు. అతడిని రక్షిద్దామని యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మైపాల్‌ను బయటకు తెచ్చేసరికి మృతి చెందినట్టు గుర్తించారు. మృతుడికి నాలుగేళ్ల పాప, భార్య ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్టున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-12-09T04:29:23+05:30 IST