డిగ్రీ పాఠ్యపుస్తకంలో మన గ్రామాల చరిత్ర

ABN , First Publish Date - 2021-10-29T05:18:27+05:30 IST

రాష్ట్రంలోని డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థుల కోసం రూపొందించిన తెలుగు సాహితీ దుందుభి పాఠ్యపుస్తకంలో కొండపాక మండలంలోని వివిధ గ్రామాల ప్రస్తావన చోటు చేసుకున్నది.

డిగ్రీ పాఠ్యపుస్తకంలో మన గ్రామాల చరిత్ర


కొండపాక, అక్టోబరు 27: రాష్ట్రంలోని డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థుల కోసం రూపొందించిన తెలుగు సాహితీ దుందుభి పాఠ్యపుస్తకంలో కొండపాక మండలంలోని వివిధ గ్రామాల ప్రస్తావన చోటు చేసుకున్నది. ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ రాయడం ఎలా అనే పాఠ్యాంశంలో సిద్దిపేట జిల్లా శాసనాలపై విద్యార్థుల స్టడీ ప్రాజెక్టు రిపోర్టును పొందుపరిచారు. 2017 సంవత్సరంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల తెలుగు అధ్యాపకుడు డాక్టర్‌ చెప్పెల హరినాథశర్మ పర్యవేక్షణలో సిద్దిపేట జిల్లా శాసనాలు అనే అంశంపై బృంద పరిశోధన చేసి జిజ్ఞాస కార్యక్రమంలో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. విద్యార్థులు స్రవంతి, భరత్‌, కిషన్‌రాథోడ్‌, శ్రీహర్షారెడ్డి, రమాదేవి ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా మర్పడగ, కొండపాక, దుద్దెడ గ్రామాల్లోని ప్రాచీన ఆలయాలను, శిలాశాసనాలను అధ్యయనం చేసి ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సమర్పించారు. విద్యార్థులకు నివేదిక ఎలా రాయాలో నేర్పించడంలో భాగంగా ఈ నివేదికను పాఠ్యాంశంలో చేర్చారు. Updated Date - 2021-10-29T05:18:27+05:30 IST