కాలుష్య కారక పరిశ్రమల తీరుపై హైకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2021-02-05T05:42:46+05:30 IST

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్‌ గ్రామ శివారులో గల ఫార్మా పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్యంపై స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో గురువారం విచారణకు వచ్చింది.

కాలుష్య కారక పరిశ్రమల తీరుపై హైకోర్టు ఆగ్రహం

త్వరగా వివరణ ఇవ్వాలని పీసీబీ అధికారులకు ఆదేశం

హత్నూర, ఫిబ్రవరి 4 : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్‌ గ్రామ శివారులో గల ఫార్మా పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్యంపై స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో గురువారం విచారణకు వచ్చింది. పరిసర గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పరిశ్రమల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా పీసీబీ అధికారులు సరైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. లేకపోతే సీనియర్‌ అధికారులే కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.

Updated Date - 2021-02-05T05:42:46+05:30 IST