కొండపోచమ్మ ఆలయంలో వైభవంగా శివపార్వతుల కల్యాణం
ABN , First Publish Date - 2021-11-27T05:24:32+05:30 IST
మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలో గల ప్రసిద్ధిపుణ్య క్షేత్రం శ్రీకొండపోచమ్మ ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలను గత మూడు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్న సంగతి విదితమే.

జగదేవపూర్, నవంబరు 26: మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలో గల ప్రసిద్ధిపుణ్య క్షేత్రం శ్రీకొండపోచమ్మ ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలను గత మూడు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం శివపార్వతుల కల్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ నిర్వాహకులు కనులపండువగ నిర్వహించారు. చివరిరోజు అమ్మ వారిని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను ఆలయ పురోహితులు ఘనంగా సత్కరించారు.
మజీద్‌పల్లిలో...
వర్గల్, నవంబరు 26: మండలంలోని మజీద్‌పల్లి శివాలయంలో గుడాల మనోహర్ ఆధ్వర్యంలో శుక్రవారం శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో ఉదయం స్వామివారికి విశేష పంచామృతాభిషేకాలు, అనంతరం కుంకుమార్చనలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ మండపంలో శివపార్వతుల దేవత మూర్తులకు గుడాల మనోహర్ దంపతులు వేద పండితుల వేద మంత్రోచ్ఛారణలతో కల్యాణ వేడుకలు నిర్వహించారు. వేడుకలకు గ్రామస్థులు అధికంగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ జాలిగామ లతా రమేశ్‌గౌడ్, సర్పంచ్ బబ్బురి లత, గ్రామస్థులు పాల్గొన్నారు.