ఉన్నవి కూల్చారు.. కొత్తవి మరిచారు!

ABN , First Publish Date - 2021-10-29T04:59:19+05:30 IST

పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లను కూల్చిన అధికారులు వాటి స్థానంలో కొత్తవి నిర్మించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఉన్నవి కూల్చారు.. కొత్తవి మరిచారు!
ముస్లాపూర్‌లో శిథిలమైన మరుగుదొడ్లు

పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులకు  తిప్పలు


 అల్లాదుర్గం, అక్టోబరు 28 పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లను కూల్చిన అధికారులు వాటి స్థానంలో కొత్తవి నిర్మించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా 235 మంది విద్యార్థులు, 119 మంది విద్యార్థినులు, ఉపాధ్యాయులు  ఇబ్బందులు పడుతున్నారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని మరుగుదొడ్లతో పాటు ప్రహరీని 161 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రెండేళ్లక్రితం కూల్చేశారు. పరిహారం కింద రూ.11 లక్షలు మంజూరయ్యాయి. కానీ ఏడాదిగా నిర్మాణ పనులు పూర్తికాలేదు. స్కూలులో మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రమాదమని తెలిసినా జాతీయరహదారిని దాటి అవతలివైపు వెళ్లి విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. మండల విద్యాధికారిగా ఉన్న పోచయ్య ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఎంఈవో ఉన్న పాఠశాలలోనే సమస్యలు తల్తెడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. Updated Date - 2021-10-29T04:59:19+05:30 IST