సమస్యల పరిష్కారానికి సీపీఐ అలుపెరగని పోరాటం

ABN , First Publish Date - 2021-12-27T04:42:46+05:30 IST

ప్రజాసమస్యలపై నిరంతరంగా అలుపెరగని పోరాటాలు చేస్తున్న ఘనత సీపీఐది అని సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందపవన్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికి సీపీఐ అలుపెరగని పోరాటం

సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందపవన్‌ 

ఘనంగా సీపీఐ 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పలుచోట్ల పార్టీ జెండా ఎగురవేత


బెజ్జంకి, డిసెంబరు26: ప్రజాసమస్యలపై నిరంతరంగా అలుపెరగని పోరాటాలు చేస్తున్న ఘనత సీపీఐది అని సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందపవన్‌ అన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ పార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లారెడ్డితో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మంద పవన్‌ మాట్లాడారు. పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న అసమానతలపై పోరాటం చేసిన ఘనత ఎర్ర జెండా పార్టీదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభ్యుదయవాదులు, లౌకికవాదులపై, వామపక్ష పార్టీల పైనా దాడులు పెరిగాయని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. 

ప్రజలకు ఇచ్చిన హామీలను కాగితాలకే పరిమితం చేసి రాష్ట్ర ఖజనాను కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. సీపీఐ నిరుపేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్‌రెడ్డి, మండల కార్యదర్శి బోనగిరి రూపేష్‌, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సంగెం మధు, ధర్మారెడ్డి, శంకర్‌, మహే్‌ష, రాకే్‌ష, ఆనంద్‌, రమే్‌ష, శివకృష్ణ, వెంకటేష్‌, పలువురు పాల్గొన్నారు.

సీపీఐ జెండా ఆవిష్కరణ

సిద్దిపేట అర్బన్‌, డిసెంబరు 26 : అవినీతి పాలకులకు వ్యతిరేకంగా పేద ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం చేయడమే సీపీఐ లక్ష్యమని జిల్లా కార్యదర్శి మంద పవన్‌ అన్నారు. ఆదివారం భారత కమ్యూనిస్టు పార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవనం వద్ద పార్టీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం ఉద్యమాలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్‌, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మన్నెకుమార్‌, పార్టీ పట్టణ కార్యదర్శి బన్సీలాల్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సంపత్‌, నాయకులు భిక్షపతి,రాజు, నర్సింహులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవం

చేర్యాల, డిసెంబరు 26: సీపీఐ 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం చేర్యాలలో ఆపార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ జిల్లా కార్యవర్గసభ్యుడు అందె అశోక్‌ స్థానిక అంగడిబజారు వద్ధ పార్టీపతాకాన్ని ఎగురవేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పోరాడేది సీపీఐ మాత్రమేనన్నారు. కార్యక్రమంలో నాయకులు ఈరు భూమయ్య, కుడిక్యాల బాలమోహన్‌, బండారి సిద్ధులు, బాలకృష్ణ, గూడెపు సుదర్శన్‌, పుల్లని వేణు, బంగారు ప్రేమ్‌కుమార్‌, ముస్త్యాల శంకరయ్య, బింగి దుర్గయ్య, ఆత్మకూరి హరికృష్ణ, సురేందర్‌, ఇప్పకాయల వెంకటేశం, కొల్పుల కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T04:42:46+05:30 IST