అన్నదమ్ములపై దాడి చేసిన నలుగురిపై కేసు
ABN , First Publish Date - 2021-09-04T04:16:02+05:30 IST
సిర్గాపూర్ మండలంలోని సంగెం గ్రామంలో ఇటీవల ద్విచక్ర వాహనాల దగ్ధం చేసిన ఘటనలో తమ పేర్లు పోలీసులకు చెబుతారా అని అన్నదమ్ములపై దాడి చేసి గాయపర్చిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సిర్గాపూర్ ఎస్‌ఐ నారాయణ శుక్రవారం తెలిపారు.

కల్హేర్, సెప్టెంబరు 3: సిర్గాపూర్ మండలంలోని సంగెం గ్రామంలో ఇటీవల ద్విచక్ర వాహనాల దగ్ధం చేసిన ఘటనలో తమ పేర్లు పోలీసులకు చెబుతారా అని అన్నదమ్ములపై దాడి చేసి గాయపర్చిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సిర్గాపూర్ ఎస్‌ఐ నారాయణ శుక్రవారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివారాల ప్రకారం... సంగెం గ్రామానికి చెందిన కేతావత్ మహిపాల్, నరేష్, రామారావ్, సంతోష్ అనే వ్యక్తులు గురువారం నాగేందర్‌రావ్‌పై దాడి చేశారు. బైకులను దగ్ధం చేయడంతో పాటు నాగేందర్‌రావ్ కారు అద్దాలను పగులగొట్టిన కేసులో కేతావత్ మహిపాల్‌ను గురువారం పోలీసులు విచారించారు. అనంతరం గ్రామానికి వెళ్లిన మహిపాల్ పోలీసులకు తమ కుటుంబసభ్యుల పేర్లు చెబుతావా అంటూ పొలం నుంచి వస్తున్న నాగేందర్‌రావ్‌పై దాడి చేశాడు. అనంతరం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను బెదిస్తుండగా ఇంట్లోకి ప్రవేస్తున్న నాగేందర్‌రావ్ సోదరుడు సురే్‌షపై కూడా దాడి చేసి గాయపర్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నారాయణ తెలిపారు.