పిల్లివాగుపై వంతెనకు మరమ్మతులు చేపట్టాలి
ABN , First Publish Date - 2021-10-30T04:27:56+05:30 IST
తంగళ్లపల్లిలోని పిల్లివాగుపై ఉన్న వంతనెకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
కోహెడ, అక్టోబరు 29: తంగళ్లపల్లిలోని పిల్లివాగుపై ఉన్న వంతనెకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. కోహెడ నుంచి తంగళ్లపల్లి, శనిగరం మీదుగా జిల్లా కేంద్రానికి వెళ్లే ఈ రహదారిపై ఉన్న వంతెన ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిందన్నారు. తాత్కాలికంగా రూ.16 లక్షల వ్యయంతో మరమ్మతులు చేయిస్తానని ఎమ్మెల్యే సతీ్‌షకుమార్ హామీ ఇచ్చి 40 రోజులు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్త చేశారు. వంతెన కొట్టుకుపోవడంతో తంగళ్లపల్లి గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి 20 రోజులకు పైగా రవాణా సౌకర్యం నిలిచిపోయిందన్నారు. అలాగే ఐకేపీ కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఈ రహదారే ప్రధానం కానున్నదన్నారు. ఎమ్మెల్యే స్పందించి వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నారాయణగౌడ్, గాజుల వెంకటేశ్వర్లు, హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దూలం శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆవుల మహేందర్, చిట్యాల రాయమల్లు, చెప్పాల రవీందర్, ఎండి రఫీ, సంపత్‌రెడ్డి, చేపూరి శ్రీశైలం, బత్తిని వెంకన్న, జాగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.