ప్రమాదవశాత్తు బావిలో పడి గల్లంతైన బాలుడు

ABN , First Publish Date - 2022-01-01T04:22:11+05:30 IST

ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో జారి పడి ఓ బాలుడు గల్లంతయ్యాడు.

ప్రమాదవశాత్తు బావిలో పడి గల్లంతైన బాలుడు

జహీరాబాద్‌, డిసెంబరు 31: ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో జారి పడి ఓ బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన జహీరాబాద్‌ పట్టణంలోని ఆనంద్‌నగర్‌ కాలనీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.  జహీరాబాద్‌ పట్టణ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామానికి చెందిన చందు(16) నెలరోజులుగా పస్తపూర్‌ చౌరస్తా వద్ద గల ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. చందు గురువారం రాత్రి ఆనంద్‌నగర్‌ కాలనీకి వెళ్లి, అక్కడ ఇళ్ల మధ్యన ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిని గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయాడు. అతడి అరుపులకు చుట్టుపక్కలవారు వచ్చి చూసి పోలీసులకు సమాచారమందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెలికి తీసేందుకు యత్నించినప్పటికీ ఆ బావిలో పేరుకుపోయిన భారీ చెత్త కారణంగా ఫలితం లేకపోయింది.  శుక్రవారం ఉదయం క్రేన్‌ సాయంతో తిరిగి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ సాయంత్రం వరకు  జాడ దొరకలేదు. 

Updated Date - 2022-01-01T04:22:11+05:30 IST