గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-02-06T05:48:55+05:30 IST

చిన్నకోడూరు, ఫిబ్రవరి 5: చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతైన నాగరాజు మృతదేహం శుక్రవారం లభ్యమైంది.

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మృతదేహన్ని పరిశీలిస్తున్న అధికారులు, పోలీసులు

చిన్నకోడూరు, ఫిబ్రవరి 5: చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతైన నాగరాజు మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గురువారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేప  ట్టినా నాగరాజు ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం తహసీల్దార్‌ శ్రీనివా్‌సరావు, ఎస్‌ఐ సాయుకుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా నాగరాజు మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వజనరల్‌ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య దివ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-02-06T05:48:55+05:30 IST