గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-12-10T04:52:58+05:30 IST
మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామ శివారులో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

ఝరాసంగం, డిసెంబరు 9: మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామ శివారులో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పానగర్ గ్రామ శివారులోని క్రషర్‌మిషన్ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు ఆ పరిసరాల్లో పని చేస్తున్న రైతులు పోలీసులకు సమాచారమందించారు. మృతుడి ఎడమచేతిపై శివుడి బొమ్మతో పచ్చబొట్టు ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.