గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-05-20T05:46:30+05:30 IST
జహీరాబాద్ పట్టణ సమీపంలోని పస్తాపూర్ కమాన్‌వద్ద కారు మెకానిక్ షెడ్‌లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

జహీరాబాద్, మే 19: జహీరాబాద్ పట్టణ సమీపంలోని పస్తాపూర్ కమాన్‌వద్ద కారు మెకానిక్ షెడ్‌లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. జహీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. పస్తాపూర్ కమాన్‌వద్ద కారు మెకానిక్ షెడ్‌లో ఓ గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా సుమారు 40 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం షెడ్‌లో పడి ఉంది. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ గదికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సంబంధీకులు ఎవరైన ఉంటే జహీరాబాద్ పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.