బైక్‌ అదుపుతప్పి పడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-11-06T05:14:41+05:30 IST

ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పి ఒకరు మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి మిట్టపల్లి సమీపంలో చోటు చేసుకుంది.

బైక్‌ అదుపుతప్పి పడి ఒకరి మృతి

 సిద్దిపేట అర్బన్‌, నవంబరు 5: ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పి ఒకరు మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి మిట్టపల్లి సమీపంలో చోటు చేసుకుంది. బంధువులు, ఎన్సాన్‌పల్లి సర్పంచ్‌ రవీందర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన చాట్ల అరుణ్‌కుమార్‌(26).. వెల్కటూర్‌ గ్రామంలోని బంధువుల ఇంటికి బుధవారం రాత్రి బైక్‌పై వెళ్లి తన తల్లిని దింపాడు. తిరిగి స్వగ్రామానికి బయలుదేరగా.. మిట్టపల్లి సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు బైక్‌ అదుపుతప్పడంతో కిందపడి మృతిచెందాడు. గురువారం తెల్లవారు జామున స్థానికులు గమనించి ఎన్సాన్‌పల్లి సర్పంచ్‌కు సమాచారం అందించారు. మృతుడికి భార్య అశ్విని, రెండు సంవత్సరాల కూతురు ఉంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ, త్రీ టౌన్‌ ఎస్‌ఐ కొమురయ్య తెలిపారు.


 


Updated Date - 2021-11-06T05:14:41+05:30 IST