బైక్‌ అదుపు తప్పి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-11-03T04:38:45+05:30 IST

ప్రమాదవశాత్తు బైక్‌ అదుపుతప్పడంతో ఒకరు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి మిరుదొడ్డి మండలం చెప్యాల చౌరస్తా వద్ద చోటుచేసుకుంది.

బైక్‌ అదుపు తప్పి ఒకరి మృతి

 మిరుదొడ్డి, నవంబరు 2: ప్రమాదవశాత్తు బైక్‌ అదుపుతప్పడంతో ఒకరు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి మిరుదొడ్డి మండలం చెప్యాల చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. ఏఎ్‌సఐ మధు తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్‌ మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన దాసరి నర్సింహులు(30) మిరుదొడ్డి మండలం అల్వాల్‌ గ్రామానికి వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం రాత్రి వెళ్లాడు. అదే రాత్రి గాజులపల్లికి బయలుదేరగా చెప్యాల పరిధిలోని మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బైక్‌ అదుపుతప్పడంతో కిందపడి చనిపోయాడు. మంగళవారం ఉదయం లింగుపల్లి గ్రామానికి చెందిన స్థానికులు చెప్యాల పరిధిలో జరిగిన ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. నర్సింహులు భార్య కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. 


 

Updated Date - 2021-11-03T04:38:45+05:30 IST