బైకు అదుపు తప్పి పడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-03-22T05:36:27+05:30 IST

బైక్‌ అదుపుతప్పి పడి తలకు బలమైన గాయం కావడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారని ఆదివారం ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

బైకు అదుపు తప్పి పడి ఒకరి  మృతి
మృతుడు అనిల్‌


రేగోడు మార్చి 21: బైక్‌ అదుపుతప్పి పడి తలకు బలమైన గాయం కావడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారని ఆదివారం ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం దుద్యాలకు చెందిన లింగంపల్లి అనిల్‌(32) ఆదివారం గజవాడ-గట్టుపల్లి మధ్య రోడ్డుపై విగతజీవిగా పడి ఉండడాన్ని గజవాడ గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన పోలీసులు మృతుడు అనిల్‌గా గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనిల్‌ భార్య సురేఖ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.Updated Date - 2021-03-22T05:36:27+05:30 IST