దళిత మహిళననే అధికారులు పట్టించుకోవడం లేదు

ABN , First Publish Date - 2021-10-30T04:40:53+05:30 IST

తాను దళిత మహిళననే కారణంతోనే అధికారులు పట్టించుకోవడం లేదని దౌల్తాబాద్‌ ఎంపీపీ గంగాధర సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కుతోనే తాను ఎంపీపీని అయ్యానని తెలిపారు. అధికారిక కార్యక్రమాలకు, మండలంలోని ఇతర అభివృద్ధి పనులపై అధికారులు తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని వాపోయారు.

దళిత మహిళననే అధికారులు పట్టించుకోవడం లేదు
సమావేశంలో మాట్లాడుతున్న దౌల్తాబాద్‌ ఎంపీపీ సంధ్య

దౌల్తాబాద్‌ ఎంపీపీ గంగాధరి సంధ్య ఆవేదన


రాయపోల్‌, అక్టోబరు 29 : తాను దళిత మహిళననే కారణంతోనే అధికారులు పట్టించుకోవడం లేదని దౌల్తాబాద్‌ ఎంపీపీ గంగాధర సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కుతోనే తాను ఎంపీపీని అయ్యానని తెలిపారు. అధికారిక కార్యక్రమాలకు, మండలంలోని ఇతర అభివృద్ధి పనులపై అధికారులు తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. మండల ప్రత్యేకాధికారి మొదలుకొని, పంచాయతీ కార్యదర్శి వరకు తనను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్ణయిస్తున్నారని, అయినప్పటికీ తాను వస్తానని తెలియజేసినా వాటిని రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలని అధికారులను కోరారు. 


Updated Date - 2021-10-30T04:40:53+05:30 IST