అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2021-11-01T04:37:14+05:30 IST

ఎల్లారెడ్డిపేట మండలం నర్సాపూర్‌ గ్రామంలో ఆరు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన శంకర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బంజార కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.

అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలి

 హుస్నాబాద్‌, అక్టోబరు 31: ఎల్లారెడ్డిపేట మండలం నర్సాపూర్‌ గ్రామంలో ఆరు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన శంకర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బంజార కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. బాలిక కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బంజార కమిటీ నాయకులు గుగులోతు శంకర్‌, సోములు, డాక్టర్‌ ధర్మానాయక్‌, భిక్షపతి, కాళిదాసు, సరోజన, రఘుపతి, రాజునాయక్‌, సత్యం నాయక్‌, జగన్‌, రవీందర్‌, మోహన్‌, శ్రీనివాస్‌, రమేశ్‌, కిషన్‌, సంపత్‌నాయక్‌, బోడ రవీందర్‌, వెర్షినాయక్‌, లింగానాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అక్కు శ్రీనివాస్‌, రజిత పాల్గొన్నారు.


 

Updated Date - 2021-11-01T04:37:14+05:30 IST