11న టీజీయూజీసెట్‌ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2021-07-09T05:03:43+05:30 IST

తెలంగాణ గురుకులం అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీజీయూజీసెట్‌) ఈనెల 11న జరుగనున్నట్లు టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఎస్‌ డిస్ర్టిక్‌ కో ఆర్డినేటర్‌ మర్సి వరూధిని తెలిపారు.

11న టీజీయూజీసెట్‌ ప్రవేశ పరీక్ష

 మెదక్‌, రామాయంపేటలో కేంద్రాలు

 హాజరుకానున్న 597 మంది విద్యార్థులు : డీసీవో వరూధిని


మెదక్‌ అర్బన్‌, జూలై 8: తెలంగాణ గురుకులం అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీజీయూజీసెట్‌) ఈనెల 11న జరుగనున్నట్లు టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఎస్‌ డిస్ర్టిక్‌ కో ఆర్డినేటర్‌ మర్సి వరూధిని తెలిపారు. పరీక్ష నిర్వహణకు మెదక్‌లోని తెలంగాణ సోలేష్‌ వెల్ఫేర్‌ బాలికల (వెలుగు), రామాయంపేటలోని కాళ్లగడ్డ సోలేష్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో ఎగ్జామ్స్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరిగే పరీక్షకు 597 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు గంట ముందుగానే సెంటర్‌కు చేరుకోవాలని, మాస్క్‌ ధరించి, శానిటైజర్‌, వాటర్‌ బాటిల్‌ను వెంట తెచ్చుకోవాలన్నారు. హాల్‌టికెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎ్‌స.ఇన్‌ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-07-09T05:03:43+05:30 IST