కుక్కల దాడితో పది గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2021-05-30T05:30:00+05:30 IST

దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో ఆదివారం కుక్కల దాడిలో పది గొర్రెలు మృతి చెందాయి.

కుక్కల దాడితో పది గొర్రెలు మృతి
కుక్కల దాడిలో మృతిచెందిన గొర్రెలు

దుబ్బాక, మే30: దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో ఆదివారం కుక్కల దాడిలో పది గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రాజం రాజమల్లయ్యకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో పది గొర్రెలు మృతిచెందగా, మరో 38 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ పెరుగుపద్మ, ఎంపీటీసీ కొమటిరెడ్డి మమత కోరారు.

విద్యుదాఘాతంతో గొర్రెలు మృతి

కొండపాక, మే 30: కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన జక్కుల యాదగిరి గొర్రెలు విద్యుదాఘాతానికి గురై ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాయి. యాదగిరి తన గొర్రెలను రోజు మాదిరిగా షెడ్‌లో ఉంచాడు. శనివారం రాత్రి గాలి దుమారం వర్షానికి విద్యుత్‌ తీగ తెగి పడడంతో విద్యుదాఘాతానికి గురయ్యాయి. నాలుగు గొర్రెలు మృతిచెందగా మరో మూడు గొర్రెల పరిస్థితి విషమంగా ఉంది. సుమారు రూ. 50 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గొర్రెలు మృతి చెందిన బాధిత కుటుంబాన్ని సర్పంచ్‌ మహాదేవ్‌, యాదవ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు పరామర్శించారు.

Updated Date - 2021-05-30T05:30:00+05:30 IST