ఎక్కడికక్కడే కట్టడి

ABN , First Publish Date - 2021-12-29T05:16:18+05:30 IST

ఉపాధ్యాయుల విభజన, కొత్త జిల్లాల కేటాయింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు మంగళవారం తలపెట్టిన సెక్రటేరియట్‌ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న టీపీటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులను పోలీసులు జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా అరెస్టుచేసి పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం 317 జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎక్కడికక్కడే కట్టడి
సంగారెడ్డి పట్టణంలో పోలీసులు అరెస్టు చేసిన టీపీటీఎఫ్‌ నాయకులు

సెక్రటేరియట్‌ ముట్టడి భగ్నం   

ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టులు


సంగారెడ్డి క్రైం, డిసెంబరు 28 : ఉపాధ్యాయుల విభజన, కొత్త జిల్లాల కేటాయింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు మంగళవారం తలపెట్టిన సెక్రటేరియట్‌ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న టీపీటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులను పోలీసులు జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా అరెస్టుచేసి పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం 317 జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదరాబాదరాగా షెడ్యూల్‌ జారీచేసి ఉపాధ్యాయులను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. జీవో 317ను వెంటనే సవరించాలని డిమాండ్‌ చేశారు. ఈ జీవోతో స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు పంపాలని, ప్రాధాన్యత, స్పౌస్‌, సీనియార్టీపై వచ్చిన అప్పీళ్లను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంతర్‌ జిల్లా బదిలీలకు, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. పాఠశాలలకు ఉపాధ్యాయుల కేటాయింపులు అడహక్‌ పద్ధతిలో చేపట్టాలని సూచించారు. ఉపాధ్యాయులందరికీ సాధారణ బదిలీలు నిర్వహించి అందరికీ న్యాయం చేయాలన్నారు. ఏకపక్ష, బాధ్యతారహిత్యమైన వైఖరిని విడనాడాలని అన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపకుండా టీపీటీఎఫ్‌ నాయకులను అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు వై.అశోక్‌కుమార్‌ అన్నారు. జిల్లావ్యాప్తంగా అరెస్ట్‌ అయిన ఉపాధ్యాయుల్లో సంగారెడ్డిలో టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు వై.అశోక్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు మర్పల్లి లక్ష్మయ్యయాదవ్‌, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి అనుముల రాంచెందర్‌, జిల్లా కార్యదర్శి ఎ.అశోక్‌కుమార్‌ను సంగారెడ్డి పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సోమశేఖర్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ జాకీర్‌ హుస్సేన్‌లను సంగారెడ్డి రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంది మండలంలో కంది మండల అధ్యక్షుడు జనార్దన్‌, ప్రధాన కార్యదర్వి సిద్దేశ్వర్‌ను ఇంద్రకరణ్‌ పోలీసులు, సదాశివపేటలో జిల్లా ఉపాధ్యక్షుడు మేకల శ్రీనివాస్‌, ఏకానందం, ఆర్‌.కిష్టయ్య, తుల్జయ్య, ఆనందరాజ్‌, కె.శంకర్‌, వట్‌పల్లిలో శివకుమార్‌, శ్రీనివా్‌సచార్యులను, జహీరాబాద్‌లో నర్సిములు, మొగులయ్య, నర్సింహులు, జోగిపేటలో చంద్రప్రకాష్‌, న్యాల్‌కల్‌లో అమృత్‌, అనంతరావు, శ్రీనివాస్‌, తుకారాం తదితరులు అరెస్టయ్యారు. 


ఉపాధ్యాయుల అరెస్టులు అప్రజాస్వామికం

-టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌ రెడ్డి

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 28: తమ న్యాయమైన సమస్యలపై సెక్రటేరియట్‌ ముట్టడికి తరలివెళ్లకుండా ఉపాధ్యాయులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి మెదక్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్ధానికత అధారంగానే ఉద్యోగ, ఉపాధ్యాయుల విభజన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కేటాయింపుల్లో అన్ని ఖాళీలను చూపించాలని, తాత్కాలిక పద్ధతిలోనే కేటాయింపులు ఉండాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలకు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు మ్యాడం బాలకృష్ణ, జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి మామిళ్ల అంజనేయులు, బ్లాక్‌  కాంగ్రెస్‌ అధ్యక్షుడు హఫీజొద్దీన్‌ తదితరులు సంఘీభావం తెలిపారు.

Updated Date - 2021-12-29T05:16:18+05:30 IST