ప్రైవేట్‌ టీచర్లకు ఊరట

ABN , First Publish Date - 2021-04-21T05:55:48+05:30 IST

కొవిడ్‌ కారణంగా విద్యా సంస్థలు మూతపడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్‌ టీచర్లకు, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి కాస్త ఊరట కలగనున్నది.

ప్రైవేట్‌ టీచర్లకు ఊరట

 రూ.2 వేల చొప్పున నేడు ఖాతాల్లో జమ


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి: కొవిడ్‌ కారణంగా విద్యా సంస్థలు మూతపడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్‌ టీచర్లకు, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి కాస్త ఊరట కలగనున్నది. గుర్తింపు పొందిన విద్యాసంస్థల సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేల  రూపాయల చొప్పున సాయం బుధవారం బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నది. సంగారెడ్డి జిల్లాలో 428 గుర్తింపు పొందిన ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 4,589 మంది టీచర్లు, 413 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఉన్నారు. వీరందరి దరఖాస్తులను పరిశీలించి ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున నగదు సాయంతో పాటు 25 కిలోల చొప్పున బియ్యం అందజేయడానికి అధికారలు ఏర్పాట్లు చేశారు. నగదు సాయం బ్యాంక్‌ ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం నుంచి జమ చేయనున్నారు. 25 కిలోల చొప్పున బియ్యాన్ని ఆధార్‌, బయోమెట్రిక్‌, విద్యాసంస్థ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి సమీప రేషన్‌ షాపుల్లో పొందవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ప్రకటించిన సాయంపై ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-04-21T05:55:48+05:30 IST